ఈయన ఇప్పటికి అందరికి ఆదర్శవంతుడు ఫీల్డ్ మార్షల్ కె ఎం కరియప్ప అందించిన సేవలు అమూల్యం

 S Vishnu Sharmaa, INN/Chennai, @svs037 
యన ఒక గొప్ప సైనికుడు, అంతకు మించి అందరికి ఆదర్శవంతుడు. ఆయన వద్దకు వచ్చిన వారు ఎవరైనా సరే, కింది స్థాయి సైనికాధికారులైన సరే, ఆయన ఇట్టే ఆప్యాయంగా పలకరిస్తారు. వీటన్నిటికీ మించిన ఓ గొప్ప విషయం వున్నది ఆయన గురించి చెప్పుకోవలసినది. నేడు మన దేశానికీ ఇంత మెరుగైన సైన్యం రావడానికి కూడా ఈయనే కారణం. అయన మరెవరో కాదు ఫీల్డ్ మార్షల్ కే ఎం కరియప్ప.      
వాస్తవానికి ఇండియన్ ఆర్మీ డే (భారత సైన్య దినం) సంబరాలు దేశమంతటా జనవరి ౧౫ న జరిగినప్పుడు అసలు మన అందరం స్మరించవలసిన గొప్ప వ్యక్తి ఈయనే. ఐతే మంచి పనులు చేసిన ఆదర్శవంతులను స్మరించి గౌరవించడానికి ఏ సమయం, ముహూర్తం అవసరం లేదు. ఏ సమయం లోనైనా వాళ్ళను గౌరవించవచ్చు. వాళ్ళు చేసిన గొప్ప కార్యాలకు విలువ ఎప్పుడూ ఉంటుంది. మనకు ఇంత గొప్ప సైన్య వ్యవస్థను ఇచ్చిన కారియప్పను ఇన్ఫోడియా ఓసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేసింది.
ఈయన ఏనాడూ ఐతే మన సైన్యానికి అధిపతి గా బాధ్యతలు చేపట్టారో ఆ రోజే ఇండియన్ ఆర్మీ డే గా దేశమంతటా కొనియాడబడుతోంది. కరియప్ప మన సైన్యానికి జనవరి ౧౫ ౧౯౪౯ లో సర్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి కమాండర్ ఇన్ చీఫ్ గా పదవి చేపట్టారు. పెద్దగా వేరే చెప్పవలసిన అవసరం లేదు, మన ఆర్మీ విజయానికి కారణం తన సామర్థ్యం మాత్రమే. ఈ సామర్థ్యం నిరాటంకం గా ఎదగటానికి కారణం రాజకీయ ప్రభావాలకు లోను కాకుండా ఉండటమే. 
కరియప్ప చేపట్టిన ఎన్నో చర్యల వల్ల భారత సైన్యం రాజకీయ ప్రభావాలకు దూరంగా ఉండగలిగింది. అయన చేపట్టిన చర్యలలో ముఖాయమైనది ఇండియన్ నేషనల్ ఆర్మీ (సుభాష్ చంద్ర బోస్, ఐ ఎన్ ఏ) కు చెందిన సైనిక సిబ్బందిని భారత ఆర్మీ లో చేరుకోవడానికి అంగీకరించకపోవడమే. అలాగని ఐ ఎన్ ఏ లో పని చేసిన వారిపైన కరియప్ప కు గౌరవం లేదని కాదు, వాళ్ళు సైన్యం లోకి వస్తే రాజకీయాలకు మిగితా సైనికులు ప్రభావితం అవుతారని అయన విశ్వసించే వారు. ఐతే దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఐ ఎన్ ఏ సిబ్బంది పైన ఈయనకు చాలా గౌరవభావం ఉండేది.
ఐ ఎన్సి ఏ సిబ్బందిని అదుపులోకి తీసుకుని వాళ్ళను బందీలుగా ఉంచిన ప్రాంతంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా చాల దయనీయ స్థితులు ఉండటం కరియప్ప చూసి బాధ పడ్డారు. అప్పటి అడఁజూటంట్ జనరల్ గారికి ఈయన రాసిన లేఖ లో ఐ ఎన్ ఏ సైనికులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆయన కోరారు. అధికారులు స్పందిస్తూ తగు చర్యలు చేపట్టటం తో ఐ ఎన్ ఏ సిబ్బంది కి ఊరట కలిగింది. కరియప్ప చేపట్టిన మరో చర్య కూడా ఇండియన్ ఆర్మీ ని రాజకీయ ప్రభావానికి లోను కాకుండా కాపాడింది. మిగితా ప్రభుత్వ సంస్థలలో రేజర్వేషన్లు కల్పించినట్లే సైన్యంలో కూడా చెయ్యాలని కరియప్ప పై గట్టి వత్తిడి ఎదురైనది, అయినా ఆయన అందుకు ఏమాత్రం అంగీకరించలేదు.
కరియప్ప గారు తన సామర్థ్యానికి సాక్షత్తు జవహర్లాల్ నెహ్రు గారి నుంచే ప్రసంసములు అందుకున్నారంటే ఈయన గొప్పతనం యిట్టె తెలిసిపోతుంది. ౧౯౪౫ లో ఆయన వజిరిస్థాన్లో బన్ను ఫ్రాంటియర్ బ్రిగేడ్ కి నేతృత్వం వహిస్తున్నప్పుడు అక్కడి ప్రాంతీయ వాసుల పై ఈయన అవలంబించిన తీరు నెహ్రు గారి ప్రశంసలను అందుకొంది. అక్కడి ప్రాంతీయ వాసులను బ్రిటిష్ సైనికాధికారులు బలవంతంగా అణిచివేసే తీరును అవలంబించేవారు. కానీ కరియప్ప దానికి భిన్నంగా వెళ్లి వాళ్లతో స్నేహపూర్వమైన వ్యవహారాన్ని పాటించారు. దీనితో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని నెహ్రు గారి ద్రుష్టి ని చాలా ఆకట్టుకుంది. 
ఈ సైన్యాధిపతికి దేశ రక్షణ ఎప్పుడు ముఖ్యమే. ఇందుకు ఆయన ఏ విధమైన చర్యనైనా చెప్పట్టడానికి ఆయన సందేహిచే వారు కాదు. గతంలో కాశ్మీర్లోకి పాకిస్తానీ లస్కర్లు దాడి చేసినప్పుడు వారిని తరిమికొట్టేందుకు అప్పటి ఆయన పై అధికారి సార్ రాయ్ బుచర్ నుంచి అనుమతి లభించలేదు. ఏ చర్యలు వద్దని స్పష్టంగా చెప్పటం జరిగింది కూడా. అయినా ఈయన ఆ ఆర్డర్లను బేఖాతరు చేస్తూ చొరబాటుదారులను తరిమి కొట్టేందుకు గట్టిగ పూనుకున్నారు. ఈయన చర్యలవల్ల మనకు లేహ్-లడఖ్ ప్రాంతంపై మల్లి మన దేశానికీ పట్టు లభించింది. 
అందరిని ఆకట్టుకునే మరో గుణం ఈయనలో వున్నది. ఆయన వద్దకు ఎవరు వెళ్లినా, ముఖ్యంగా కింది స్థాయి సనికాధికారులైన సరే ఈయన వారందరిని చాలా ఆప్యాయంగా పలకరించేవారు. సైన్య జవాన్ల పైన ముఖ్యంగా ఈయన చాలా శ్రద్ధ వహించేవారట. జవాన్లు సైన్యానికి చాలా కీలకమని ఎవరడిగినా ఈయన యిట్టె చెప్పే వారు. ఇంతటి ఉత్తమమైన సేవలు ఈయన అందించారు కనుకే మనందరికీ ఈయన ఆదర్శం. ఈ ఉత్తమమైన సేవ తత్పరతవల్లే ఈయనకు ఎన్నో అవార్డులు లభించాయి. ఫీల్డ్ మార్షల్ గా ఎదిగే అరుదైన గౌరవం ఈయనకు లభించింది. ఈయన తరువాత ఈ స్థాయికి ఎదిగిన వారు సామ్ మానేక్షా మాత్రమే మన భారత సైన్యంలొ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: