మారనున్న రైలు ప్రయాణ విధానం

S Vishnu Sharmaa, INN/Chennai, @svs037
వైజ్ఞానిక పరిజ్ఞానం మనకెంతో సౌకర్యాలను ఇచ్చింది. మనం జీవించే విధానాన్ని కూడా మార్చేసింది. కొన్ని వేల ఏళ్ళ క్రితం ఉన్నట్టు ఇప్పుడు మనం వుంటల్లేదు, ఎంతో మెరుగుగా జీవిస్తున్నాము, దీనికి కారణం సైన్స్ పుణ్యమా అని మనకు వఛ్చిన టెక్నాలిజీయే. ఈ టెక్నాలజీ కారణంగా మనము రైలు లో ప్రయాణించే విధానం కూడా మారనుంది. ఇప్పటివరకు యూరోపులోనో లేదా అమెరికాలోనే లేదా జపాన్ లో మాత్రమే సాధ్య పడే అత్యాధునిక రైలు ప్రయాణం ఇప్పుడు భారత్లోనూ అందనుంది. ఇందుకు కారణం ట్రైన్ ౧౮, అత్యాధునిక సదుపాయాలతో చెన్నై కు చెందిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐ సీ ఎఫ్) తయారు చేసిన సెమి సూపర్ ఫాస్ట్ రైలు.
ఈ రైలు అందరి దృష్టిని ఆకట్టుకుంది, దీని కమిషనింగ్ అప్పుడు రైల్వే బోర్డు అప్పటి  చైర్మన్ అశ్వని లోహాని ఈ మోడరన్ ట్రైన్ మన దేశ రైలు ప్రయాణం చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని అయన ఎంతో గర్వంగా చెప్పారు. అంతటి గట్టి వాక్కు తో అడుగు పెట్టిన ఐ అత్యాధునిక రైలు కు ఎదురు ఉండదని అనుకుందాం. మరో సీనియర్ రైల్వే అధికారి ప్రకారం ఈ ట్రైన్ ౧౮ రావటం ఒక విధంగా మంచిదే అని అభిప్రాయ పడ్డారు. నిజానికి రైలు ప్రయాణానికి విమాన రవాణా నుంచి గట్టి పోటీ ఎదురు అవుతోంది మన ఇండియా లో. వేగంగా ప్రయాణించగలగటం కొద్దీ సమయంలోనే గమ్యాన్ని చేరగలగటం వాళ్ళు చాలామందికి విమాన ప్రయాణం వైపు ఆకర్షితులుఅవుతున్నారు. 
ఈ పరిస్థుతులలో రైలు ప్రయాణ వేగం పెంచటం పై ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందని, వేగం ఎక్కువ చేసినప్పుడే మనం రైలు ప్రయాణం వైపు ప్రజల ద్రుష్టి ఉంటుందని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. ఇలా జరగకపోతే రైలు వ్యవస్థకు ఆదాయం పూర్తిగా కాకపోయినా చాలావరకు తగ్గే అవకాశం వుంది. ట్రైన్ ౧౮ ని వాడుకలోకి తీసుకురావటం రైలు ప్రయాణ వేగాన్ని పెంచే దిశగా వేసిన సరైన తొలి అడుగని ఆ సీనియర్ అధికారి అభిప్రాయ పడ్డారు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు ఎందుకంటే, మన దేశం లో ఒక రైలు ప్రయాణించే వేగం ౯౦ కిలోమీటర్లు కాగా మొన్నీమధ్యే మనం ౧౬౦ కిలోమీటర్ల వేగాన్ని సాధించగలిగాం. విదేశాల్లో ఐతే గంటకు ౧౫౦ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం వచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నాయి. 
జపాన్ లో రైలు ప్రయాణించే వేగం దాదాపు గంటకు ౩౨౦ కిలొమీటర్లు, అదే జర్మనీ లో ఐతే రైలు గంటకు ౩౩౦ కిలొమీటర్లు ప్రయాణిస్తున్నది. చైనాలో రైళ్లు గంటకు ౪౩౧ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఏ గమ్యాలను చేరుకోవడానికి దాదాపు ౧౨ గంటలు పట్టేవో వాటినే ఇప్పుడు ౮ నుంచి ౯ గంటలలోపు చేరుకోగలుగుతున్నాం చైనాలో. దీనికి అతిపెద్ద ఉదాహరణ బీజింగ్ టూ షాంఘై మధ్య జరిగే రైలు ప్రయాణమే. చైనాలో ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న ౧,౩౧౮ కిలోమీటర్ల అక్కడి రైళ్లు ప్రతి గంటకు ౨౯౯ కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసి ఈ దూరాన్ని ౪ గంటలు ౪౮ నిమిషాల్లో పూర్తీ చేస్తాయి. అదే మన దేశంలో ఐతే చెన్నై నుంచి దేశ రాజధాని వరకు ఉన్న ౨౧౭౫ కిలోమీటర్ల దూరాన్ని ఇప్పటికి ఒకటిన్నర నుంచి రెండు రోజులు పడుతున్నది. అందుకనే మన ఇండియాలో చాల మంది విమాన ప్రయాణం వైపు మగ్గు చూపుతున్నారు. వీళ్ళ ద్రుష్టి రైలు ప్రయాణం వైపు పడాలంటే రైలు వేగం పెరగటం తప్పనిసరి.
స్పీడ్ పెరగటమే కాదు ప్రయాణం సౌకర్యాలు కూడా మెరుగు అవ్వాలి. ఈ రెండిటి కలయికే ట్రైన్ ౧౮. ఈ మాడర్న్ ట్రైన్ తయారు చేసిన ఘనత చెన్నై కు చెందిన ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐ సీ ఎఫ్) కి పూర్తిగా దక్కుతుంది. దీనిని తయారు చేయడం ఏమంత సులభంగా జరగలేదు. మేము ఈ రైలు తయారు చేసే ప్రతిపాదన రైల్వే బోర్డుకు పంపినప్పుడు మాకు అంగీకారం కూడా త్వరగా ఏమి లభించలేదు. చాలామంది సభ్యులు సందేహం వ్యక్తం చేసారు, ఐతే మేము మాత్రం మా నమ్మకాన్ని కోల్పోలేదని  ఐ సీ ఎఫ్ అప్పటి జనరల్ మేనేజర్ ఎస్ మణి తెలిపారు. రైల్వే బోర్డు నుంచి అనుమతి వచ్చాక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం తో ౧౮ నెలల్లో దాన్ని తయారు చేశామని మణి తెలిపారు. 
ఈ మాడర్న్ ట్రైన్ తయారు చెయ్యడానికి ఇప్పుడు ౧౦౦ కోట్ల రూపాయలు ఐనా భవిష్యత్తులో దీన్ని తయారు చెయ్యడానికి అయ్యే ఖర్చు మరింతగా తగ్గవచ్చని మణి తెలిపారు. రానున్న కాలంలో అనుభవం, మెరుగైన పరిజ్ఞానం కారణంగా ఇది సాధ్యపడగలదని అయన తెలిపారు. అంతే కాదు ఈ ట్రైన్లో మరిన్ని సదుపాయాలు కూడా కలిగించడం సాధ్య పడుతుందని అయన అన్నారు. ఈ రైలు మొదటి సేవను మన ప్రధాని నరేంద్ర మోడీ జండా ఊపి ప్రారంభించారు. ఇది మంచి విషయమే అయినా, ఈ రైలుకు చాలా ఇబ్బందులే ఎదురైనాయి. సాంకేతిక లోపం కారణంగా ప్రారంభోత్సవానికి ఒక రోజు తరువాత దేశ రాజధానికి ౨౦౦ కిలోమీటర్ల అవతల ఇది ఆగిపోయింది. అంతకు ముందు ఈ రైలు పై రాళ్లు విసరడం కూడా జరింగింది. ఐతే ఇవన్నీ ఈ మాడర్న్ ట్రైన్ ప్రగతిని ఆపలేవు. ఇలాంటి రైళ్లు మరిన్ని రావలసి ఉంది.
ట్రైన్ ౧౮ లాంటి ఆధునిక వాహనాలు కావలసిన అవసరం ఎంతైనా వుంది మనకు, అందుకనే ఇటువంటి వాటిని మనం ఇంకా ప్రోత్సహించాలి. ట్రైన్ ౧౮ వంటి ట్రైన్ సెట్లలో వేగంగా వెళ్లే అవకాశం ఎక్కువ, అంతే కాదు, లోకోమోటివ్లతో లాగబడే రైళ్లతో పోలిస్తే ట్రైన్ సెట్లలో శక్తిని పొదుపు చేసే అవకాశం కూడా ఎక్కువే. అతి తక్కువ స్తాపింగ్లు వున్నమార్గాల్లో ముఖ్యంగా ట్రైన్ ౧౮ వంటివి బాగా పని చేస్తాయని రైల్వే నిపుణుల అభిప్రాయం. ఇదే విషయాన్నీ సమర్థిస్తూ జర్మనీకి చెందిన రైలు నిపుణులు ఒకరు ఇన్ఫోడియాతో మాట్లాడుతూ మన భారత దేశంలో ప్రతి నగరం నుంచి ౫౦౦ నుంచి ౬౦౦ కిలోమీటర్ల దూరం వున్న ప్రాంతాలకు ట్రైన్ ౧౮ వంటి రైళ్లను ఎక్కువగా నడపాలని అయన సూచించారు.
ట్రైన్ ౧౮ వంటి వాహనాలను వాడుకలోకి తీసుకురావడానికి మరో కారణం కూడా వుంది. మన దేశ రైలు మార్గాల్లో చాల స్టేషన్లు వస్తుంటాయి. ఉదాహరణకు జమ్మూ తావి నుండి బాంద్రా టెర్మినస్ కు చేరే స్వరాజ్ ఎక్ష్ప్రెస్స్, తన ప్రయాణ మార్గంలో ౨౪ స్టాప్పింగ్లు వస్తాయి. ఇలాంటి రైళ్లు మన దేశంలో చాలా వున్నాయి. 
స్టేషన్లలో ప్రతిసారి ఆగి బయలుదేరినప్పుడు లోకోమోటివ్ తో లాగబడే రైళ్లకు వేగం పుంజుకోవడానికి కొంత సమయం పడుతుంది. అదే ట్రైన్ ౧౮ వంటి వాటిలో ఈ సమస్య ఉండదు. ఆగినా, బయలుదేరినప్పుడు కొద్దీ సమయంలోనే వేగాన్ని పుంజుకోవచ్చు.
ట్రైన్ ౧౮ వంటి వాటిని వాడుకలోకి తేవడంతో పాటు మనం ఎన్నో మార్పులు మన రైల్ నెట్వర్క్ లో తేవలసి ఉంటుంది. ఉదారణకు సరుకుల రవాణా కోసం దానికి కావలసిన డెడికేటెడ్ కారిడార్లు స్థాపించడం చేయాలి, ఇలా చేస్తే, గూడ్స్ రైళ్లను, ప్యాసింజర్ రూట్లలో నడపాల్సిన అవసరం ఉండదు, దీని వల్ల పాసెంజర్ మార్గాల్లో రద్దీ తగ్గి, ప్యాసింజర్ రైళ్లు మరింత వేగంగా నడిచే అవకాశం వుంది. మన రైలు పట్టాలను, సిగ్నల్ వ్యవస్థను కూడా ఆధునికీకరించాల్సి ఉంటుంది. చైనా తన రైల్వే వ్యవస్థను ఆధునికీకరించడానికి ౨౦౦౯ నుంచి ఇప్పటివరకు తన జీడీపీ నుంచి ౨ శాతం పైగానే ఖర్చు పెట్టింది, మన దేశంలో కూడా ఇంతే శ్రద్ధ చూపాలి రైల్వే వ్యవస్థ పైన. ఇంత మెరుగైన పని చేసింది కాబట్టి చైనా రైల్వే సంపాదన మనతో పోలిస్తే మూడింతలు ఉంటుందని రైల్వే నిపుణుల అభిప్రాయం. కొన్ని అంచనాల ప్రకారం చైనా రైల్వే ఆదాయం ౫.౯ ట్రిలియన్ ఐతే మన రైల్వే వ్యవస్థ ఆదాయం ౧.౬ ట్రిలియన్ రూపాయలు. ఆధునికీకరణ తో ట్రైన్ ౧౮ వంటి మెరుగైన ప్రయాణ సాధనాలతో మన రైల్వే వ్యవస్థ కూడా ఖ్యాతి సంపాదిస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: